శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 13:13:00

సిరిసిల్లకు దీటుగా కొడంగల్ ను అభివృద్ధి చేస్తాం

సిరిసిల్లకు దీటుగా కొడంగల్ ను అభివృద్ధి చేస్తాం

వికారాబాద్ జిల్లా:  రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చిరునవ్వుతో బతకాలన్నదే సీఎం ఆశయమని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని బొంరాస్పేట మండలం మెట్లకుంటలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసి బీటీ రోడ్డును ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో కలిసి మంత్రులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ..రైతును రాజు చేయడంలో భాగంగా ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కొడంగల్ కు రూ. 1.20 కోట్లతో బంజారా భవన్ నిర్మిస్తున్నారని తెలిపారు. కేటీఆర్ ఆదేశాలతో కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి పాడి పశువులు ఇస్తామని మంత్రులు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రెటరీ గా ఎన్నికల ప్రచారం కోసం రెండేళ్ల క్రితం ఇక్కడకు వచ్చాను. ఇక్కడ ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. అప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే తండాలలో సరైన రోడ్డు వసతి, కరెంట్ లేక అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఆరోజు  ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదని తెలిసింది. ఆరోజు మేము చెప్పింది నమ్మి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించడం వల్ల దాదాపు 250 కోట్ల రూపాయల నిధులు వచ్చాయనడం సంతోషంగా ఉందని మత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

ఉద్యమ నాయకుడు రాష్ట్రానికి సీఎం కావడం మన అదృష్టం అన్నారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్  మీద ఉన్న నమ్మకంతో నరేందర్ రెడ్డిని గెలిపించడం వల్ల గతంలో ఎప్పుడు జరగనంత అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు.  సిరిసిల్ల నియోజక వర్గానికి ధీటుగా దీనిని అభివృద్ధి చేస్తామనడం ఈ నియోజక వర్గం సీఎంకున్న ప్రత్యేక శ్రద్ద కు నిదర్శనం అన్నారు. కొడంగల్ నియోజక వర్గంలో ప్రతి కుటుంబానికి వచ్చే 3 నెలల్లో పాడి పశువులు అందించాలి. దీనికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.logo