శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 16:39:02

ఆదిలాబాద్ జిల్లాను టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తాం

ఆదిలాబాద్ జిల్లాను టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తాం

నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలను అభివృద్ధి చేయటానికి పర్యాటక శాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన శాసన మండలి సభ్యుడు పురాణం సతీష్ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి శాసన మండలి లో సమాధానమిచ్చారు. మరోసారి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపిస్తామని వెల్లడించారు.

ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలను ఒక టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయటానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వీటితో పాటు జిల్లాలో ఉన్న గాంధారి వనం అభివృద్ధికి రెండు, మూడు రోజుల్లో టూరిజం, హెరిటేజ్ తెలంగాణ అధికారులను పంపిస్తామన్నారు. ఆదిలాబాద్ లో అద్భుతమైన టూరిజం ప్రదేశాలు ఉన్నాయన్నారు. అక్కడికి వెళ్లి చూస్తే మనం వేరే దేశంలో ఉన్నామా అనే భావన కలుగుతుందన్నారు.

వీటితోపాటు సీఎం కేసీఆర్  ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో టూరిజం ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం, మిడ్ మానేరు, రంగనాయక సాగర్, కొండ పోచమ్మ జలాశయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయ ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

హరితహారంలో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానం : కలెక్టర్

మేడ్చల్ : ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ చేపట్టిన తెలంగాణకు హరితహారంలో జిల్లా ముందజలో దూసుకెళ్తున్నది. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ప్రథమ స్థానవంలో ఉందని జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని జనచైతన్య పార్కులో సోమవారం హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు మేడ్చల్‌ జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో అర్బన్‌ ట్రీ ప్లాంటేషన్‌ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. 

మున్సిపాలిటీల్లో 3 నుంచి 4 లక్షల మొ క్కలను అర్బన్ ట్రీ ప్లాంటేషన్‌గా నాటుతున్నట్లు వివరించారు. బడ్జెట్‌లో 10 నుంచి 15 శాతం హరతహారం కోసం కేటాయించడానికి వీలుండటంతో ఎక్కువగా మొక్కలు నాటాలన్నారు. ఇప్పటికే అర్బన్ ట్రీ ప్లాంటేషన్‌, పల్లె ప్రకృతి వనాలు కార్యక్రమాల్లో ల్‌ జిల్లా ముందుందన్నారు. జిల్లా లక్ష్యం 63 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా ఇప్పటికే 70 లక్షలకు పైగా మొక్కలను నాటినట్లు వివరించారు. ప్రస్తుతం ఉన్న గ్రీనరీతో పాటు ప్రజాప్రతినధులు, అధికారులు, పార్టీల నేతలు ప్రజలను చైతన్య పరిచి మరింత ఎక్కువగా గ్రీనరీని ఏర్పాటు చేసే విధంగా  మొక్కలను నాటాలన్నారు. 

కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్‌ కారింగుల రాజేశ్వర్‌రావు, వైస్‌ చైర్మన్‌ పన్నాల వాణివీరారెడ్డి, జడ్పీటీసీ అనితలాలయ్య, కమిషనర్‌ సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు పాండు, రజినివేణుగోపాల్‌రెడ్డి, రాజుయాదవ్‌, సురేష్‌, నర్సింగ్‌గౌడ్‌, కో ఆఫ్షన్‌ సభ్యులు మిర్జా షఫిఉల్లాబేగ్‌, శ్రీధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్‌రెడ్డి, యూత్‌ అధ్యక్షుడు సుభాష్‌గౌడ్‌, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

logo