సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 19:12:04

నశింపేట కాజ్‌వే పై హైలెవల్ బ్రిడ్జిని నిర్మిస్తాం

నశింపేట కాజ్‌వే పై హైలెవల్ బ్రిడ్జిని నిర్మిస్తాం

సూర్యాపేట : జిల్లాలోని ఆత్మకూర్ ఎస్ మండలం నశింపేట కాజువే పై హైలెవల్ బ్రిడ్జిని నిర్మిస్తామని విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నశింపేట గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వర్షాలు వచ్చినప్పుడల్లా నశింపేట నుంచి చివ్వేంల మండలం ముకుందాపురం రహదారిపై ట్రాఫిక్ జామ్ అయి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అంతే కాకుండా  కాజ్‌వే  పై వర్షపు నీరు పొంగిపొర్లడంతో సమీపంలోనీ పంటపొలాలు ముంపునకు గురి అవుతున్నాయని మంత్రికి వివరించారు. స్పందించిన ఆయన అప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణపు సాధ్యాసాధ్యాలలను తెలుసుకొని త్వరలోనే పనులు మొదలు అధికారులను ఆదేశించారు.


logo