నిజాంసాగర్‌కు పూర్వవైభవం తెస్తాం

కామారెడ్డి : ఒక్క గుంట భూమి కూడా పడావుగా ఉంచనివ్వమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలోని బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామ శివారులో రూ.28.29 కోట్లతో నిర్మించనున్న చెక్‌డ్యాం పనులను గురువారం భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1932లో నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఎలాగైతే ఉండేదో రానున్న పదిరోజుల్లో కూడా అదేవిధంగా ఉండేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
కాళేశ్వరం ద్వారా కొండ పోచమ్మ సాగర్ నుంచి నీరు వచ్చి చేరుతుందన్నారు. అదేవిధంగా వచ్చే ఏడాది నాటికి మల్లన్న సాగర్ నుంచి నీరు శాశ్వతంగా వచ్చే ఏర్పాట్లను చేస్తున్నామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ పుణ్యమా అని బాన్సువాడ నియోజకవర్గంలో నాలుగు చెక్‌డ్యామ్‌లకు నిధులు మంజూరయ్యాయని అన్నారు. రాజకీయాల కోసం తోక తొండం లేని వారు సీఎంను విమర్శిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
జనగామలో మాజీ కౌన్సిలర్ దారుణ హత్య..
లష్కర్ వారం ఆదాయం రూ.40,16,738
గజ్వేల్‌ను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
దేశం అబ్బురపడేలా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు
‘టాయ్ ట్రైన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
తాజావార్తలు
- కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధనకు ఇక సమరమే
- మహేష్ బాబుపై మనసు పడ్డ బాలీవుడ్ హీరోయిన్
- డెస్క్‌టాప్‌లోనూ వాట్సాప్ వీడియో.. వాయిస్ కాల్.. ఎలాగంటే!
- ఫిట్నెస్ టెస్టులో రాహుల్, వరుణ్ ఫెయిల్!
- మహిళను కొట్టి ఆమె పిల్లలను నదిలో పడేసిన ప్రియుడు
- బీజేపీకి మంత్రి కేటీఆర్ హెచ్చరిక
- గోల్కొండ కీర్తి కిరీటం..కుతుబ్‌షాహీ టూంబ్స్
- న్యాయవాద దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్
- సీరియస్ దర్శకులంతా ఒకేసారి..
- ఎస్సీ ఉప కులాలకు న్యాయం చేస్తాం : మంత్రి కొప్పుల