ఆరు నూరైనా కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తాం : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలమంతా కలిసి ఢిల్లీకి వెళ్తాం. ఆరు నూరైనా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి కాజీపేట రైల్వే ఉన్నతాధికారులు తదితరులతో కలిసి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశంపై సమీక్ష జరిపారు.
అనంతరం 150.05 ఎకరాల భూమిని రైల్వే అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల దశాబ్దాల కాలం నాటి ఆకాంక్ష రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. పురాతన కాలంనాటి కాజీపేట జంక్షన్‌కు అప్పుడెప్పుడో మంజూరైన కోచ్ ఫ్యాక్టరీ అనుకోని పరిస్థితుల్లో వేరే రాష్ట్రానికి తరలిపోయిందన్నారు. అయితే, కోచ్ ఫ్యాక్టరీకి బదులు రైల్వే వాగన్ ఓవర్ హోలింగ్ వర్క్ షాప్ ప్రాజెక్టు వచ్చిందన్నారు.
అయితే, మొదట్లో రైల్వే అధికారులు కోరిన విధంగా 60 ఎకరాల స్థలానికి మించి 150.05 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాల నుంచి సేకరించి ఈ రోజు రైల్వే అధికారులకు అప్పగించిందన్నారు. ఇక్కడి ప్రజల డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
తాజావార్తలు
- ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
- రిపబ్లిక్ డే.. సరిహద్దులో భారీ భద్రత
- మొదలైన సర్కారు వారి పాట షూటింగ్.. వీడియో
- రెండు బస్సుల మధ్య బైకు.. బ్యాంకు మేనేజర్ మృతి
- మెక్సికో ప్రెసిడెంట్‌కు కరోనా పాజిటివ్
- దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
- నెత్తిన ముళ్ల కిరీటం, చేతులకు శిలువ.. జగపతి బాబు లుక్ వైరల్
- 1.28 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం
- తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గింపు?
- నల్లగొండలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య