ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 16:02:50

సీఎం కేసీఆర్‌ ప్రకటనను స్వాగతిస్తున్నాం : అసదుద్దీన్ ఒవైసీ

సీఎం కేసీఆర్‌ ప్రకటనను స్వాగతిస్తున్నాం : అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్: సచివాలయ ప్రాంతంలోనే కొత్త ఆలయం, మసీదు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. సచివాలయంలోని పాత భవనాలను కూల్చి వేస్తున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న ఆలయం, మసీదు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో వాటిని కూడా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై స్పందించిన  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయం, మసీదులకు ఇబ్బంది కలగడంపై విచారం వ్యక్తం చేశారు.

ఆలయం, మసీదును ప్రస్తుతం ఉన్న వాటికంటే విశాలంగా, సౌకర్యవంతంగా సచివాలయ ప్రాంతంలోనే నిర్మిస్తామని, వాటికోసం అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం ప్రకటించారు. ఈ ప్రకటనపై అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నానని అన్నారు. దీనికి సంబంధించి యునైటెడ్ ముస్లిం ఫోరం తరఫున పూర్తి స్టేట్‌మెంట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo