శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 22:29:29

బాధిత కుటుంబాల‌ను ఆదుకుంటాం : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

బాధిత కుటుంబాల‌ను ఆదుకుంటాం : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

హైద‌రాబాద్ : వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల వ‌ద్ద చోటుచేసుకున్న ప్ర‌మాదం దురదృష్టకరమని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బాధిత కుటుంబాల‌ను ప్ర‌భుత్వ ప‌రంగా ఆదుకుంటామ‌న్నారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు తెలిపారు. మృతుల కుటుంబాల‌కు మంత్రి త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు. రోడ్డు పక్కల ఉన్న ఓపెన్ బావుల పట్ల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల‌న్నారు. ఇలాంటి బావులు, బొందలు వుంటే, వాటిని వెంటనే మూయడమా? లేక ప్రమాదాలు జరగకుండా బందోబస్తు చేయడమా? అన్నది అధికారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల‌న్నారు. రోడ్డు భ‌ద్ర‌త‌పై అటు అధికారులు, ఇటు పోలీసుల‌తో చర్చించి మెరుగైన చర్యలు చేపట్ట‌నున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు.