గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 01:37:16

వైద్యులకు అండగా ఉంటాం: మంత్రి ఈటల

వైద్యులకు అండగా ఉంటాం:  మంత్రి ఈటల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రాణాలకు తెగిం చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న వైద్యులకు ప్రభు త్వం అండగా ఉంటుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ భరోసా ఇచ్చారు. గురువారం బీఆర్కే భవన్‌లో వైద్యులు, పారామెడికల్‌, ఇతర సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వైద్య సంఘాల నేతలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వాటిని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైద్యులు, పారామెడికల్‌ ఇతర సిబ్బందికి, కుటుంబసభ్యులకు నిమ్స్‌, టిమ్స్‌, గాంధీ దవాఖానల్లో ప్రత్యేక చికిత్స అందిస్తామని చెప్పారు. నిమ్స్‌లో 50 పడకలు ఏర్పాటుచేస్తామని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అందరికీ అక్కడే చికిత్స అందించేలా చూస్తామని స్పష్టంచేశారు. కరోనా చికిత్స అందిస్తూ చనిపోయిన వైద్యసిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌కు విన్నవిస్తానని పేర్కొన్నారు. సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, తెలంగాణ వైద్య సంఘాల నేతలు రవిశంకర్‌, కత్తి జనార్దన్‌, పుట్ల శ్రీనివాస్‌, బొంగు మహేశ్‌, నర్సింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సుజాత, హేమలత పాల్గొన్నారు.


logo