శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 26, 2020 , 19:33:46

దీక్షిత్ రెడ్డి కుటుంబానికి అండగా వుంటాం: మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

దీక్షిత్ రెడ్డి కుటుంబానికి అండగా వుంటాం: మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా లో మొన్నటి కిడ్నాప్, హ‌త్య‌ ఘటనలో దీక్షిత్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప‌రామ‌ర్శించారు. దీక్షిత్ రెడ్డి చిత్రపటానికి పూలతో అంజలి ఘటించారు. అనంత‌రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..దీక్షిత్ రెడ్డి కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. ఇంటి పక్క వాడే ఇంత దుర్ఘటన పాల్పడటం బాధాకరమ‌న్నారు. దీక్షిత్ రెడ్డి కుటుంబానికి మేము అండగా వుంటామ‌న్నారు. దీక్షిత్ రెడ్డిని చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. పోలీసులు కూడా ఈ కిడ్నాప్ ను చేధించడానికి చాలా కష్టపడ్డారు. దీక్షిత్ రెడ్డి మళ్లీ తిరిగి వస్తాడని అందరం భావించాం. ప్రజలందరూ మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామ‌న్నారు. ఈ సంఘటన గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామ‌ని హామీనిచ్చారు. దీక్షిత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఎంపీ మాలోత్ కవిత,ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులున్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.