ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 13:21:05

రైతులకు సరిపడా ఎరువులు సరఫరా చేస్తాం

రైతులకు సరిపడా ఎరువులు సరఫరా చేస్తాం

పెద్దపల్లి: రామగుండం ఎరువుల కర్మాగారం ద్వారా తెలంగాణ వ్యవసాయ రంగానికి మహర్దశ పట్టనుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని రామగుండంలో నిర్మిస్తున్న ఎరువుల కర్మాగారాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు చందర్, మనోహర్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎరువుల కర్మాగారం ప్రారంభానికి ప్రతి వారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సమీక్షలు చేస్తుస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే ఎరువుల కర్మాగారం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఏడాదికి 12.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఈ కర్మాగారం సొంతమన్నారు. వ్యవసాయ రంగానికి ఎలాంటి ఢోకా లేకుండా ఎరువులను సరఫరా చేస్తామన్నారు. ఎరువుల ఉత్పత్తి గురించి మంత్రికి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సెప్టెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు అధికారులు వివరించారు.


logo