శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 06:28:02

మహనీయుల ఆశయాలకై జ్ఞాన పాదయాత్ర..

మహనీయుల ఆశయాలకై జ్ఞాన పాదయాత్ర..

హైదరాబాద్: పల్లెల్లో, పట్టణాల్లో పాదయాత్ర చేసి మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా పాటు పడుతానని సావిత్రి బాయి పూలే మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్‌ అల్లూరి సావిత్రి తెలిపారు. ఆదివారం జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ బాలాజీనగర్‌ లో గల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నుంచి ఏడాది పాటు నిర్వహించే జ్ఞాన పాతయాత్రను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లూరి సావిత్రి మాట్లాడుతూ.. పూలే, అంబేద్కర్‌లు సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంవత్సరం పాటు రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల్లో పాదయాత్ర చేసి, ఆ మహనీయుల ఆశయాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఏఎస్‌ఎస్‌ నేషనల్‌ కోఆర్డినేటర్‌ నల్లా రాధాకృష్ణ, నేషనల్‌ కమిటీ సభ్యుడు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, బల్లి శ్రీనివాస్‌, తదితదరులు పాల్గొన్నారు.


logo