గురువారం 02 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 12:57:28

భావితరాలకు పచ్చదనాన్ని కానుకగా అందిద్దాం: కేటీఆర్‌

భావితరాలకు పచ్చదనాన్ని కానుకగా అందిద్దాం: కేటీఆర్‌

హైదరాబాద్‌: భవిష్యత్‌ తరాలకు పచ్చదనాన్ని కానుకగా అందించే లక్ష్యంతో ముందుకు సాగుదామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈసారి హరితహరం కర్యాక్రమాన్ని మరింత పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. నగర శివార్లలోని శంషాబాద్‌లో ఉన్న హెచ్‌ఎండీఏ నర్సరీని మంత్రి సందర్శించారు. నర్సరీలో మొక్కల పెంపకాన్ని ఆయన పరిశీలించారు. పురపాలక పట్టణాల్లో మొక్కలు నాటడంతోపాటు మొక్కల పెంపకంపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.   

హైదరాబాద్‌ పరిధిలో ఎవరైనా మొక్కలు కావాలనుకునేవారు నగర పరిధిలోని నర్సరీల నుంచి ఉచితంగా తీసుకోవచ్చని ప్రకటించారు. నగరంలోని నర్సరీల వివరాలను అందరికీ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి పిలుపునిచ్చారు. నర్సరీలోని కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.


logo