సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 23:33:01

తెలంగాణ యూనిటీ దేశానికి తెలియజేశాం..

తెలంగాణ యూనిటీ దేశానికి తెలియజేశాం..

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడంలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ ప్రజలంతా ‘జనతా కర్ఫ్యూ’ పాటించి విజయవంతం చేసిన విషయం తెలిసిందే. కాగా, అన్ని రాష్ర్టాల్లోకెల్లా ‘తెలంగాణ’ జనతాకర్ఫ్యూను పాటించి, మిగితా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. ఇందుకు నిదర్శనం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్వతహాగా.. సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి అభినందనలు తెలుపడమే.

కాగా, రాష్ట్ర ప్రజలు.. కేంద్ర, రాష్ట్ర సూచనలు పాటించి.. జనతా కర్ఫ్యూను పాటించి, విజయవంతం చేశారు. ప్రధాని పిలుపుకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రజలు చూపిన చొరవకు రాజ్యసభ సభ్యులు ‘జోగినిపల్లి సంతోష్‌కుమార్‌‘ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజల యూనిటీకి ఇదొక నిదర్శనమని ఈ సందర్భంగా ఎంపీ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. భారతీయులుగా మనం కలిసికట్టుగా ఏదైనా సాధించగలమని నిరూపించామని పేర్కొన్నారు. ప్రధాని సూచించినట్లు సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా ఇంటి ఆవరణలోకి వచ్చి చప్పట్లతో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. 

కరోనా వైరస్‌ నివారణకు ప్రతి ఒక్కరు చూపిన చొరవ ప్రశంసించదగిన విషయమని ఆయన తెలిపారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్న ఫోటోలను ఎంపీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 


logo