e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home తెలంగాణ ఏపీనే మనకు 4,457 కోట్లు బాకీ

ఏపీనే మనకు 4,457 కోట్లు బాకీ

  • ఏపీ జెన్‌కో కాకి లెక్కలు
  • మొత్తం బకాయిలపై చర్చకు వెనుకడుగు
  • ఎన్సీఎల్టీలో పసలేని కేసు
  • ఉన్నట్టుండి ఉపసంహరించి తాజాగా హైకోర్టుకు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (నమస్తే తెలంగాణ): ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ సామెత ఏపీ జెన్‌కోకు అతికినట్టు సరిపోతుంది. తెలంగాణలో విద్యుత్తు వెలుగులను చూసి తట్టుకోలేక నాలుగేండ్లుగా కాకి లెక్కలతో గారడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నది. తెలంగాణ విద్యుత్తు సంస్థల నుంచి తమకు రూ.6,283.68 కోట్ల బకాయి సొమ్ము రావాలంటూ సోమవారం హైకోర్టులో పిటిషన్‌వేసింది. నిజానికి స్పష్టంగా లెక్కలు తీస్తే ఏపీయే తెలంగాణకు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని మన విద్యుత్తు సంస్థల అధికారులు చెప్తున్నారు.

ఎన్సీఎల్టీలో పల్టీ కొట్టేలా..
తెలంగాణ విద్యుత్తు సంస్థలు తమకు బకాయి ఉన్నాయని, వాటిని చెల్లించనందున ఆ సంస్థలు దివాలా తీసినట్టుగా ప్రకటించాలని మూడేండ్ల క్రితం ఏపీ జెన్‌కో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ)లో పిటిషన్‌ వేసింది. దీనిపై మన విద్యుత్తు సంస్థలు కూడా కౌంటర్‌ దాఖలుచేశాయి. ఈ కేసులో ఓటమి ఖరారు కావటంతో మూడేండ్ల తర్వాత ఉన్నట్టుండి పిటిషన్‌ను ఉపసంహరించుకున్నది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు వచ్చేనెల 28వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

అసలు నిజాలు ఇవీ..

  • రెండు రాష్ర్టాల జెన్‌కోల మధ్య మాత్రమే రూ.6,283 కోట్ల బకాయి ఉన్నట్టు ఏపీ జెన్‌కో చెప్తున్నది. ట్రాన్స్‌కోలు, డిస్కంల మధ్య ఉన్న బకాయిల విషయం బయట పెట్టడంలేదు. రెండు రాష్ర్టాల జెన్‌కోలు, ట్రాన్స్‌కోలు, డిస్కంల అధికారులు కూర్చొని మొత్తం లెక్కలు తీద్దామని అడిగితే ఏపీ నోరు మెదపడంలేదు.
  • ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు, అనంతపురం జిల్లాలు సీపీడీసీఎల్‌ కింద ఉండేవి. ఇప్పుడా సంస్థ తెలంగాణలో ఎస్పీడీసీఎల్‌గా మారింది. అప్పుడు ఆ రెండు జిల్లాల్లో విద్యుత్తు వ్యవస్థల అభివృద్ధికి సీపీడీసీఎల్‌ తీసుకొన్న రుణాలను ఇప్పటికీ తెలంగాణ విద్యుత్తు సంస్థలే చెల్లిస్తున్నాయి. 15.6.2021 నాటికి రూ.1,932 కోట్లు తెలంగాణ చెల్లించింది. దీనికి వడ్డీ కలుపుకొంటే రూ.2,725 కోట్లు అవుతుంది. వీటి గురించి ఏపీ జెన్‌కో నోరెత్తటంలేదు.
  • ఉమ్మడి రాష్ట్రంలో కుదుర్చుకొన్న పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లు (పీపీఏ)లను రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ రద్దుచేసి వివాదాలకు బీజం వేసింది. పునర్విభజన చట్టం ప్రకారం పీపీఏలను రద్దుచేయడం కుదరదు. తెలంగాణను చీకట్లలో మగ్గేలా చేయాలనే దురుద్దేశంతోనే ఏపీ ఈ నిర్ణయం తీసుకొన్నదని తెలంగాణ విద్యుత్తు సంస్థల అధికారులు మండిపడుతున్నారు.
  • అన్ని లెక్కలు తీస్తే తెలంగాణకే ఏపీ రూ.4,457 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని మన అధికారులు తేల్చారు.

చర్చలకు రావడం లేదు
రెండు రాష్ర్టాల విద్యుత్తు సంస్థల మధ్య ఉన్న బకాయిల విషయంపై కూర్చొని మాట్లాడుకుందామని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. కానీ ఏపీ విద్యుత్తు సంస్థలు మొండిగా వ్యవహరిస్తున్నాయి. చర్చలు జరిపితే మనకే ఏపీ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే చర్చలకు రావడంలేదు. తెలంగాణను అప్రతిష్ఠపాలు చేసేందుకే ఇలా వ్యవహరిస్తున్నది. అన్ని లెక్కలు తీస్తే మనకే రూ.4,457 కోట్లు వస్తాయి.
-దేవులపల్లి ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana