గురువారం 02 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 11:15:50

సీజనల్‌ వ్యాధుల నుంచి కుటుంబాన్ని కాపాడుకోవాలి : మంత్రి సత్యవతి

సీజనల్‌ వ్యాధుల నుంచి కుటుంబాన్ని కాపాడుకోవాలి : మంత్రి సత్యవతి

మహబూబాబాద్‌ : సీజనల్‌ వ్యాధుల నుంచి కుటుంబ సభ్యులను కాపాడుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మహబూబాబాద్‌లోని తన నివాసంలో మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దోమలు ఉండే ప్రదేశాలను గుర్తించి శుభ్రంచేశారు. నిల్వ నీటిని తొలగించారు. ఇంటి ఆవరణలోని పరసరాలను శుభ్రపరిచారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... వానాకాలంలో డెంగ్యూ, చికెన్‌ గున్యా వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అందరూ విధిగా పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ నివాస పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు డ్రై డే నిర్వహించాలన్నారు. 

ప్రపంచ మహమ్మారి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై కూడా ఎక్కు శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతిఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలన్నారు. కరోనాకు మందు లేదని ముందు జాగ్రత్తలే శ్రీరామ రక్ష అని అన్నారు. నిర్లక్ష్యం, మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులకు ప్రాణాంతకం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా ఉండొద్దని పేర్కొన్నారు. logo