బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 17:50:08

విధి నిర్వహణలో ప్రజలతో మమేకం కావాలి

విధి నిర్వహణలో ప్రజలతో మమేకం కావాలి

హైదరాబాద్ : అంకితభావంతో విధులు నిర్వహించి ఆ పదవికే వన్నె తేవాలని, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లకు సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత పోస్టింగ్స్ పొందిన 257 మంది డిప్యూటీ తహసీల్దార్ లు, 284 మంది ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ లలో కొందరు టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యుడు వివేక్ ఆధ్వర్యంలో.. ఆదివారం మంత్రుల అధికారిక నివాసంలో వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారికి ప్రభుత్వ ప్రతినిధిగా అండగా నిలవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సాధించాలని, నియమ నిబంధనలను పక్కాగా పాటించాలన్నారు. 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని పేర్కొన్నారు. ఆయా గ్రామాలు, మండలాల్లోని ప్రజా ప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకోవాలని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని వినోద్ కుమార్ సూచించారు.

logo