బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 17:23:48

పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : మంత్రి ఐకే రెడ్డి

పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : మంత్రి ఐకే రెడ్డి

నిర్మల్ : ప్రజాప్రతినిధులు నిర్మల్ పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో కో అప్సన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్నారు.  జనరల్ వర్గం సభ్యులుగా చిలుక గోవర్ధన్, కోటగిరి నాగలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. మైనారిటీ వర్గం సభ్యులుగా సయ్యద్ మఝార్, నజియా మెహవిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యులను శాలువాతో సత్కరించిన మంత్రి ఎన్నిక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

 అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్ పురపాలక సంఘంలో 42 వార్డు సభ్యులకు, నలుగురు కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో ఇచ్చిందని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నిక ఆలస్యం జరిగిందని అన్నారు. నిర్మల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అన్ని రంగాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు వార్డు సభ్యులు, కో అప్షన్ సభ్యులు, అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కమిషనర్ బాలకృష్ణ, వార్డు సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo