కరోనా బాధితులకు సాయం చేసేందుకు ట్విట్టర్లో వేగంగా స్పందిస్తున్న మంత్రి కేటీఆర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఇతరరాష్ర్టాలకు చెందినవారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మంగళవారం ఇలాంటి అనేక ట్వీట్లు మంత్రి కేటీఆర్‌కు వచ్చాయి. వాటిలో కొన్ని..
ఒక్కసారి అభిమాని అయితే ఎప్పటికీ అభిమానే. ఏదో ఒకరోజు మీరు దేశానికి ప్రధాని అవుతారు. అప్పుడు తప్పుడు హామీలు ఇవ్వకుండా మీ పనితీరుతో చరిత్ర పుస్తకాలను తిరగరాస్తారు. ఇది నా తరఫున ఒక రిక్వెస్ట్. మాకు కూడా మీ లాంటి నాయకుడు కావాలి
–అఖిల్ (బెంగళూరు, కర్ణాటక)
మీరు పనిచేస్తున్న విధానం ఆదర్శనీయం అన్న. పాలిటిక్స్ అంటే లూటింగ్ తప్ప మరొకటి కాదనుకునే భవిష్యత్తుతరాలకు కొత్తదారి చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మీ అభిమాని
–వంశీకృష్ణ (ఏపీ)
రాజమండ్రి చందనానగర్లో రోడ్డును ఆక్రమించి కట్టిన నిర్మాణాన్ని తొలగించేలా చూడాలంటూ ఏపీకి చెందిన సూర్య అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన కేటీఆర్.. సమస్యను సర్కిల్ 21లోని చందానగర్ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ దృష్టికి తీసుకెళ్లా. స్వయంగా వచ్చి పరిశీలిస్తారు’ అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు సంతోషం వ్యక్తంచేసిన సూర్య.. ‘సర్.. సమస్య చందానగర్‌లో కాదు. రాజమండ్రిలోని చందనానగర్లో.. తెలంగాణలో నాయకులు, అధికారులలాగా ఏపీలోని నాయకులు, అధికారులు ఆక్టివ్‌గా లేరు. మీరు స్పందించి సమస్యను ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళతారని వేడుకుంటున్నా’ అంటూ రీట్వీట్ చేశాడు.