బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 19:14:03

బీరప్ప ఆలయ అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేయాలి

బీరప్ప ఆలయ అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేయాలి

ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు స్థానిక బీరప్ప స్వామి దేవాలయాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  సందర్శించారు. ఆలయ అభివృద్ధి కోసం మెయిన్ రోడ్డు నుంచి ఆలయం వరకు సీసీ రోడ్డు కావాలని కోరగా.. అందుకు సానుకూలంగా స్పందించి అక్కడ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటు ఆలయం వద్ద రాత్రి సమయాల్లో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు.

స్పందించిన మంత్రి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు. ఆలయం అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. అనంతరం మంత్రి పువ్వాడను శాలువాతో సన్మానించారు.logo