గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 02:12:15

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

  • విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
  • పుట్టినరోజు సందర్భంగా నాటిన మొక్కలు

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో సతీమణి సునీతారెడ్డి, కుమారుడు వేమన్‌రెడ్డి, కూతురు లహరిలతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. 

మంత్రికి దత్తాత్రేయ శుభాకాంక్షలు

మంత్రి జగదీశ్‌రెడ్డికి హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ శనివారం ఫోన్‌ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైనపాత్ర పోషించారని కొనియాడారు. భగవంతుడి ఆశీస్సులతో మరిన్ని మంచి పదవులను అధిష్ఠించాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని దత్తాత్రేయ ఆకాంక్షించారు.logo