బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 02:26:32

వృక్షాల సగటులో వెనకబడ్డాం

వృక్షాల సగటులో వెనకబడ్డాం

  • కెనడాలో ఒక మనిషికి 10వేల చెట్లు
  • మనదేశంలో సగటున 28 మాత్రమే
  • మొక్కల పెంపకం ఆవశ్యకతపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు మంగళవారం ట్వీట్‌ చేశారు. ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చితే మనదేశంలో వృక్షాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక మనిషికి సగటున 422 చెట్లు ఉంటే.. భారత్‌లో 28 మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. బ్రిటన్‌లో 47, చైనాలో 130, ఇథియోపియాలో 143, ఫ్రాన్స్‌లో 203, అమెరికాలో 699, ఆస్ట్రేలియాలో 3,266, గ్రీన్‌ల్యాండ్‌లో 4,964, కెనడాలో ఏకంగా 10,163 చెట్లు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ వివరించారు. 

అందుకే హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఎక్కువ జనాభా ఉన్న భారత్‌లో అతి తక్కువ సంఖ్యలో వృక్షాలు ఉండటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు ముందుకు రావాలని సూచించారు.  


logo