తెలంగాణ ఐ-హబ్-గుజరాత్ వీ-హబ్ మధ్య అవగాహన ఒప్పందం

హైదరాబాద్ : దేశంలో మహిళా ఇన్నోవేషన్ బలోపేతానికి తెలంగాణ-గుజరాత్ రాష్ర్టాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మహిళా ఇన్నోవేషన్‌లో గుజరాత్ ఐ-హబ్‌కి తెలంగాణ వీ-హబ్ కు మధ్య ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, గుజరాత్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి భూపేంద్రసింగ్ చుదాసమా, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి విభవారిబెన్దేవ్ సమక్షంలో తెలంగాణ ఇండ్రస్టీస్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, గుజరాత్ ప్రభుత్వ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అంజుశర్మల మధ్య ఈ అవగాహన ఒప్పందం జరిగింది.
ఒప్పందంలో భాగంగా ఇరు రాష్ర్టాల్లో ఎడ్టెక్, మెడ్‌టెక్, ఫిన్‌టెక్ రంగాల్లో 240 మంది ఔత్సాహిక మహిళ స్టార్టప్‌లను గుర్తించారు. వీటి నుండి తుది వర్చువల్, ఫిజికల్ కో-ఇంక్యుబేషన్ ప్రొగ్రాం కోసం మొత్తం 20 మంది పారిశ్రామికవేత్తలను ఎంపిక చేస్తారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 2021 మొదటివారంలో ప్రారంభం కానుంది. వీ-హబ్ ద్వారా ఇప్పటికే విమెన్ ఇన్నోవేషన్‌కి దేశవ్యాప్త గుర్తింపు లభించింది. ఇలాంటి భాగస్వామ్యం ద్వారా దేశంలో మహిళా ఇన్నోవేషన్ మరింత బలోపేతం కానుంది. ఇన్నోవేషన్ రంగంలో దేశానికి దిక్సూచిగా, ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
- విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇస్తున్న స్టార్ డైరెక్టర్..?
- వాలంటీర్లు మున్సిపల్ అధికారులకు సెల్ఫోన్లు అప్పగించాలి
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- పెట్రోల్ మంట: భారత విజ్ఞప్తిని పట్టించుకోని సౌదీ అరేబియా
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్‌కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్