శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 08, 2020 , 17:59:32

లాక్ డౌన్ పిరియడ్ ను సద్వినియోగం చేసుకున్నాం

లాక్ డౌన్ పిరియడ్ ను సద్వినియోగం చేసుకున్నాం

మహబూబ్ నగర్ : లాక్ డౌన్ నియమాలను పాటిస్తూనే లాక్ డౌన్ పిరియడ్ ను సద్వినియోగం చేసుకుని రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్- జడ్చర్ల రోడ్డు విస్తరణ పనులతో పాటు పట్టణంలోని మిగతా ప్రధాన రోడ్డు విస్తరణ పనులను ప్రస్తుతం వేగవంతంగా కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. లాక్ డౌన్ కాలాన్ని ఇందుకు సద్వినియోగం చేసుకున్నట్లు వివరించారు. రోడ్డు విస్తరణకు సహకరిస్తున్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.


logo