బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 15:06:15

మిషన్‌ భగీరథతో ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేశాం : సీఎం కేసీఆర్‌

మిషన్‌ భగీరథతో ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేశాం : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకంతో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేశామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..మిషన్‌ భగీరథ అద్భుత పథకం అని అన్నారు. ఈ పథకాన్ని యావత్‌ దేశం ప్రసంశించింది అని సీఎం తెలిపారు. మిషన్‌ భగీరథపై అన్ని వివరాలు తీసుకొని సభకు వచ్చి మాట్లాడుతుంటే కాంగ్రెస్‌ నాయకులు పారిపోయారు. సభలో పిచ్చికూతలు కూసినా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి నియోజకవర్గంలో 334 ఆవాసాలకు నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ విషయం ఆ సభ్యుడికి తెలియదా? అని సీఎం ప్రశ్నించారు. ఈ పథకం కోసం ఇప్పటికే రూ. 41 వేల కోట్లు ఖర్చు చేశాం. మరో రూ. 3వేల కోట్లకు టెండర్లు పిలుస్తామని సీఎం తెలిపారు. మిషన్‌ భగీరథ పథకాన్ని పలు రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకున్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. 


logo
>>>>>>