శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 12:42:18

వ్యవసాయాన్ని పండగ చేశాం : ప్రభుత్వ విప్ బాల్క సుమన్

వ్యవసాయాన్ని పండగ చేశాం : ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మంచిర్యాల : వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండగ అనే పరిస్థితికి తీసుకు వచ్చామని, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆయన బుధవారం జిల్లాలోని కోటపల్లి మండలం సర్వాయిపేట్ గ్రామంలో ఆయిల్ పాం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ గత పాలకులు వ్యవసాయం గురించి పట్టించుకోలేదన్నారు.

కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులకు కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు కోసం రైతులు ముందుకు వస్తున్నారని ఇది శుభ పరిణామామన్నారు.  నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు ఇచ్చి తీరుతామన్నారు. ఇప్పటికే సర్వే సాగుతోందని అది పూర్తి కాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మోల్సీ పురాణం సతీష్ తదితరులు పాల్గొన్నారు.


logo