47 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం

- పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పౌరసరఫరాల సంస్థ గతేడాది వానకాలంలో 41 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ ఏడాది 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని ఆ సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మద్దతు ధరకు కొనుగోలు చేశామని, ఇదంతా ఉద్యోగుల, సిబ్బంది కృషి వల్లే సాధ్యమైందని తెలిపారు. ఈ కృషిని ఇదే విధంగా కొనసాగించాలని కోరారు. ఈ యాసంగిలో కూడా గతం కంటే ఎక్కువ మొత్తంలో ధాన్యం దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని, ఇప్పటినుంచి సన్నద్ధం కావాలని సూచించారు. గురువారం పౌరసరఫరాల భవన్లో ఆ శాఖ కమిషనర్ పీ సత్యనారాయణరెడ్డితో కలిసి చైర్మన్ ఉద్యోగుల సంఘం 2020 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ.. రైతులు, పేద ప్రజల సంక్షేమం, ప్రయోజనాలే లక్ష్యంగా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోపికృష్ణ, సంస్థ జీఎం నాగేందర్‌రెడ్డి, జీ వాణి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
- ఆరోగ్యానికి లైవ్ చేపలే మేలు
- వ్యాక్సిన్‌పై భయం వద్దు
- నంబర్ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా
- విడుతల వారీగా అందరికీ వ్యాక్సిన్