శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 03, 2020 , 14:26:21

కరోనా కట్టడికి అన్ని పద్ధతులను అనుసరిస్తాం : మంత్రి ఈటల

కరోనా కట్టడికి అన్ని పద్ధతులను అనుసరిస్తాం : మంత్రి ఈటల

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా చికిత్సకి అందుబాటులో ఉన్న పద్ధతులను రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ దవాఖానల్లో సైతం అందజేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాకి రాష్ట్ర మంతా ఒకే వైద్య విధానం ఉండాలన్నారు. ఇన్ఫెక్షన్ డిసీజ్ లో నైపుణ్యం గల డాక్టర్స్ తో తెలంగాణలో ఉన్న ప్రభుత్వ దవాఖానల సూపరింటెండెంట్స్, చికిత్స అందిస్తున్న డాక్టర్స్ తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమెరికాకి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ విజయ్ ఎల్దండి, హైదరాబాద్ కి చెందిన డా. ఎంవీ రావు, డా. సునిత, చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. మహబూబ్ ఖాన్, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. శంకర్, నిమ్స్ వైద్యుడు డా. గంగాధర్,  వైద్యులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా సోకిన వారు జబ్బుతో కంటే భయంతో ఎక్కువ మంది చనిపోతున్నారు. పాజిటివ్ పేషెంట్ల లో ధైర్యం నింపాలన్నారు. యాంటీ వైరల్ మందులకంటే స్టెరాయిడ్ మందులు ఎక్కువ మందికి నయం చేస్తాయి. సిటీ స్కాన్ వల్ల ప్రయోజనం లేదు. ఎంత తొందరగా చికిత్స మొదలు పెడితే మరణాలను అంత తగ్గించవచ్చని మంత్రి పేర్కొన్నారు. కరోనా కట్టడికి కలిసి కట్టుగా పోరాడాలని మంత్రి పిలుపునిచ్చారు.


logo