శుక్రవారం 03 జూలై 2020
Telangana - May 27, 2020 , 16:16:29

నగరాభివృద్ధిపై దృష్టి సారించాం: మంత్రి కేటీఆర్‌

నగరాభివృద్ధిపై దృష్టి సారించాం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతున్నది. ఒకవైపు కాళేశ్వరం జలాలను కొండ పోచమ్మసాగర్‌లోకి పంపింగ్‌ చేస్తూ రైతుల కోసం కష్టిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విశేషంగా కృషిచేస్తోంది.  హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ నగర్, కామినేని దవాఖాన‌ ప్రాంతంలో నిర్మించిన ఫ్లైఓవర్లు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయని, వీటిని గురువారం నాడు జాతికి అంకితం చేస్తామని పట్టణాభివృద్ధి, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు ట్విట్టర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. నగరాభివృద్ధిలో తలమానికంగా నిలిచిన రోడ్ల అభివృద్ధి, ఫ్లై ఓవర్ల నిర్మాణంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని స్పష్టంచేశారు. దుర్గం చెరువుపై ఊగే వంతెన నిర్మాణం పనులు కూడా పూర్తికావచ్చాయి.


logo