డొల్లమాటలు, సొల్లు పురాణాలకు ఆగంకాం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : బీజేపీ నేతల డొల్లమాటలకు, సొల్లు పురాణాలకు ఆగమాగం అయ్యేటోళ్లు ఇక్కడెవరూ లేరని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్‌పేట నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి చౌరస్తాలో మంత్రి ఈ సాయంత్రం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నల్లకుంట అభ్యర్థి శ్రీదేవి రమేష్, గోల్నాక నుంచి లావణ్య శ్రీనివాస్ గౌడ్, బాగ్‌లింగంపల్లి నుంచి పద్మావతి దుర్గాప్రసాద్ లను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. అనాడు కొందరు మీ మొఖాలకు పరిపాలించుకునే తెలివి ఉందా? అని ప్రశ్నించారు. వాళ్లు మొఖాలు పగిలిపోయే విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ అభివృద్ధి మనకళ్లముందే ఉందన్నారు.
హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. పేదవారిని కడుపున పెట్టుకుని చూసుకుంటామని చెప్పాం. చెప్పిన విధంగా ఆ ఆరేండ్లలో పేదలకు, హైదరాబాద్‌కి మేలు జరిగిందా లేదా ఆలోచించాలన్నారు. ఆనాడు కరెంటు ఉంటే వార్తా.. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ పోతే వార్తా అన్నారు. మంచినీళ్ల పరిస్థితి ఎట్లుండే..ఇప్పుడు రోజు తప్పించి రోజు నీళ్లు ఇస్తున్నమా లేదా? అని అడిగారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఒక్కటే బాకీ ఉంది. అది కూడా తామే ఇస్తామన్నారు. ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదని, ఇది హుషారు హైదరాబాద్ అన్నారు. మీ డొల్లమాటలకు, సొల్లు పురాణాలకు ఆగమాగం అయేటోళ్లు ఇక్కడెవరూ లేరన్నారు. ఏం చేసినమో, ఏం చేస్తమో చెప్పి తాము ఓట్లు అడుగుతున్నాం. మరి మీరు హైదరాబాద్‌కు ఏం చేశారో, ఏం చేస్తరో చెప్పే దమ్ముందా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.
తాజావార్తలు
- రైలు కింద పడి నలుగురి ఆత్మహత్య
- గుంత కనిపిస్తే..అధికారులకు జీహెచ్ ఎంసీ కమిషనర్ సీరియస్ వార్నింగ్
- మొసలితో పరాచకాలు..అరెస్ట్ చేసిన పోలీసులు
- నగరవాసుల యాదిలోకి మరోసారి డబుల్ డెక్కర్ బస్సు
- నేడు లాజిస్టిక్ పార్క్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- పెళ్లాం కదా అని కొడితే కటకటాలే...
- దేశంలో కొత్తగా 11,666 కరోనా కేసులు
- శ్రీలంకకు ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్ గిఫ్ట్..
- వార్తలలోకి 'మనం 2'.. ఆసక్తిగా గమనిస్తున్న ఫ్యాన్స్
- విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం