సోమవారం 25 మే 2020
Telangana - May 23, 2020 , 01:40:57

విద్యుత్‌ బిల్లును అంగీకరించం

విద్యుత్‌ బిల్లును అంగీకరించం

  • జూన్‌ ఒకటిన నిరసనలు
  • విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం-2020 బిల్లును వ్యతిరేకిస్తూ జూన్‌ ఒకటిన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపనున్నట్టు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ కమిటీ (టీఎస్‌పీఈ జేఏసీ) ప్రకటించింది. విద్యుత్‌ సవరణ బిల్లుపై అభ్యంతరాలు స్వీకరిస్తున్న నేపథ్యం లో జేఏసీలోని 21 సంఘాల నేతలు శుక్రవారం మింట్‌ కంపౌండ్‌లో సమావేశమయ్యారు. ప్రజా ప్రయోజనాలకు గండికొట్టే విధంగా ఉన్న బిల్లును అంగీకరించరాదని నిర్ణయించారు. అనంతరం భవిష్యత్‌ కార్యాచరణను నేతలు మీడియాకు వెల్లడించారు.  సమావేశంలో జేఏసీ కన్వీనర్‌ పీ రత్నాకర్‌రావు, పీ సదానందం, 1104 నుంచి పద్మారెడ్డి, సాయిబాబు, 327 నుంచి శ్రీధర్‌, డిప్లొమా ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ నుంచి బీసీ రెడ్డి, అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి ఈశ్వర్‌గౌడ్‌, ఓసీ అసోసియేషన్‌ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, బీసీ అసోసియేషన్‌ అధ్యక్షుడు కుమారస్వామి, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌ నుంచి శ్యాంమనోహర్‌, టీవీసీడబ్ల్యూ అధ్యక్షుడు నాగరాజు తదితరులు  పాల్గొన్నారు.


logo