సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 01:16:28

వైద్యులకు 25 లక్షల పరిహారం

 వైద్యులకు 25 లక్షల పరిహారం

  • కరోనాతో మరణించిన వారిని ఆదుకుంటాం
  • వైద్యసంఘాల ప్రతినిధులతో మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనాతో మరణించిన వైద్యులు, ఇతర వైద్యసిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అందించే రూ.50 లక్షలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల ప్రకటించారు. మంగళవారం బీఆర్కే భవన్‌లో వివిధ వైద్య సంఘాలతో మంత్రి సమావేశమయ్యారు. ఇటీవల వైద్య సంఘాలు చేసిన విజ్ఞప్తులపై సీఎం కేసీఆర్‌తో చర్చించిన వివరాలను వారికి వెల్లడించారు. వైరస్‌ బారిన పడిన వైద్యులు, సిబ్బందిని ఆన్‌డ్యూటీగా పరిగణించాలని నిర్ణయించామని చెప్పా రు. కరోనా బారిన పడిన వైద్యులకు, వైద్యసిబ్బందికి నిమ్స్‌ దవాఖానలో పూర్తిస్థాయిలో చికిత్స అందించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. వైద్యుల ఇతర సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టంచేశారు. తమ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించడంపై వైద్య సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. సమావేశంలో వివిధ వైద్యసంఘాల ప్రతినిధులు డాక్టర్‌ రవిశంకర్‌, డాక్టర్‌ కత్తి జనార్దన్‌, డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌, పల్లం ప్రవీణ్‌, లాలూప్రసాద్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.logo