శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 02:29:44

కేటీఆర్‌ వల్లే గుజరాత్‌ నుంచి తెలంగాణకు వచ్చాం

కేటీఆర్‌ వల్లే గుజరాత్‌ నుంచి తెలంగాణకు వచ్చాం

  • బీకే గోయెంక, వెల్‌స్పన్‌ చైర్మన్‌

వెల్‌స్పన్‌ ప్లాంట్‌ను మొదట గుజరాత్‌లో ప్రారంభించాలని అనుకున్నామని, మంత్రి కే తారకరామారావు కృషి వల్ల తెలంగాణకు వచ్చామని వెల్‌స్పన్‌ చైర్మన్‌ బీకే గోయెంక పేర్కొన్నారు.  ‘మేము గుజరాత్‌లో ప్లాంట్‌ ఏర్పాటు చేయాలనుకున్నాం. పనులు కూడా ప్రారంభించాం. ఈ దశలో కేటీఆర్‌ మమ్మల్ని సంప్రదించి తెలంగాణకు రావాలని కోరారు. నాతోపాటు వెల్‌స్పన్‌ బృందంలోని ప్రతి ఒక్కరితో ఒకటికి నాలుగుసార్లు స్వయంగా మాట్లాడారు. తెలంగాణకు వస్తే కలిగే లాభాలను వివరించి, ఒప్పించారు’ అని పేర్కొన్నారు. ‘మేము ఎన్నో రాష్ర్టాలతో కలిసి పనిచేస్తున్నాం. కానీ ఇంత అద్భుతమైన స్పందన ఎక్కడా చూడలేదు. ఇది నా మనసులోంచి చెప్తున్న మాట’ అని పేర్కొన్నారు. కేటీఆర్‌ను చూస్తుంటే ఓ కంపెనీ సీఈవో మాదిరిగా రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కనిపించారని గోయెంక పేర్కొన్నారు. ‘మేము రూ.1500 కోట్లు పెట్టుబడి పెడుతామని చెప్పాం. ప్రభుత్వ ప్రోత్సాహం చూసి రూ.2000 కోట్లకుపైగా పెంచాలని నిర్ణయించాం’ అని ప్రకటించారు. 

తాజావార్తలు


logo