గురువారం 28 మే 2020
Telangana - May 18, 2020 , 18:57:17

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం : మంత్రి వేముల

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం : మంత్రి వేముల

నిజామాబాద్ : రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేయించారని, రైతులు దిగులు పడాల్సిన పని లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతుందన్నారు. ఈరోజు వరకు 31 వేల 155 మంది రైతులకు 376.25 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు.లాక్ డౌన్ నేపథ్యంలో ధాన్యం కొనుగోలులో కొంత ఆలస్యమైనా రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని రైతులకు భరోసానిచ్చారు.

జిల్లాలో మొత్తం 5.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉండగా..అందుకు గాను 355 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరిగిందన్నారు. ఇప్పటి వరకు 4.39 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 79% ధాన్యం  సేకరించామని, సేకరించిన ధాన్యంలో 4.14 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 94 శాతం ధాన్యాన్ని రైస్ మిల్లర్లుకు పంపిచించినట్లు పేర్కొన్నారు. దీంట్లో 4.02 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 92 శాతం ధాన్యాన్ని రైస్ మిల్లర్లు అన్ లోడ్ చేసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.logo