బుధవారం 03 జూన్ 2020
Telangana - May 13, 2020 , 00:47:38

మూడు వేల టన్నుల మామిడి కొంటాం

మూడు వేల టన్నుల మామిడి కొంటాం

  • పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి

జనగామ రూరల్‌: రైతులు పండించిన అన్ని పంటలనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, ప్రస్తుతం పండ్ల కొనుగోలుకూ శ్రీకారం చుట్టిందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పెద్దపహాడ్‌లో సెర్ప్‌-జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కిసాన్‌ మహిళా ఉత్పత్తిదారుల సంస్థ నిర్వహించనున్న మామిడి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో మూడు వేల టన్నుల లక్ష్యంతో సెర్ప్‌ ఆధ్వర్యంలో ఐకేపీ మహిళా సంఘం మామిడి కాయలు కొనుగోలు చేస్తుందన్నారు. వీటితోపాటు పుచ్చ, అరటి, బొప్పాయి వంటి పండ్లనూ కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్‌ నిఖిల పాల్గొన్నారు.logo