శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 02:49:23

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం

  • మంత్రి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌ రూరల్‌: రైతులను నుంచి వచ్చే ప్రతి గింజను కొనుగోలు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడారు. దసరా పండుగ సందర్భంగా రెండ్రోజులు సెలవులు రావడం, హమాలీల కొరత వల్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదన్నారు. మంగళవారం నుంచి ప్రతి గ్రామంలో ఐకేపీ, సింగిల్‌ విండో ఆధ్వర్యంలో కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు.  వర్షాల వల్ల ధాన్యానికి నలుపు రంగు వచ్చినా తిప్పి పంపకూడదని రైస్‌ మిల్లర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని 24 గంటల్లో కొనుగోలు చేయాలన్నారు.