బుధవారం 03 జూన్ 2020
Telangana - May 15, 2020 , 01:29:02

కృష్ణాపై అక్రమ నిర్మాణాలను అడ్డుకొంటాం

కృష్ణాపై అక్రమ నిర్మాణాలను అడ్డుకొంటాం

  • విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

నల్లగొండ: కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్‌ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను జరుగనివ్వమని విద్యుత్‌శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఏపీ జీవో 203పై కృష్ణా ట్రిబ్యునల్‌, అపెక్స్‌ కమిటీకి కూడా నివేదించామని.. త్వరలో సుప్రీంకోర్టుకు కూడా వెళతామని చెప్పారు. గురువారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఉండగా రైతులకు అన్యాయం జరుగదని స్పష్టంచేశారు. ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతల సాక్షిగానే తెలంగాణకు ద్రోహం జరిగిందని ధ్వజమెత్తారు. 

బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు రెండురాష్ర్టాల్లో రెండువిధాలైన వైఖరిని ప్రదర్శించడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. వృథాగాపోతున్న గోదావరి జలాలు ఎలా వాడుకోవాలో చెప్పడంతోపాటు ఇరురాష్ర్టాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నించారని గుర్తుచేశారు. విపక్షాల మాదిరిగా డ్రామాలు చేయడం తమ ప్రభుత్వానికి తెలియదని జగదీశ్‌రెడ్డి తెలిపారు. 


logo