సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 11:29:38

సీఎం కేసీఆర్ ప‌థ‌కాల‌తోనే కార్పొరేట‌ర్లుగా గెలిచాం

సీఎం కేసీఆర్ ప‌థ‌కాల‌తోనే కార్పొరేట‌ర్లుగా గెలిచాం

వ‌రంగ‌ల్ అర్బ‌న్‌:  త‌మ‌పార్టీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేసే నైతిక‌హ‌క్కు మాజీ మంత్రి కొండా సురేఖ‌కు లేద‌ని టీఆర్ఎస్‌ కార్పొరేట‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. తాము సీఎం కేసీఆర్ సంక్షేమ ప‌థ‌కాల‌తోనే గెలిచామ‌ని  వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ టీఆర్ఎస్‌ కార్పొరేట‌ర్లు ప్ర‌క‌టించారు. ఎవ‌రి ద‌యా, దాక్షిణ్యాల‌తో తాము విజ‌యంసాధించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నేత‌ల‌పై మాజీ మంత్రి కొండా సురేఖ త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. త‌మ పార్టీ నాయ‌కుల‌పై అడ్డ‌గోలు వ్యాఖ్య‌లు చేస్తే స‌హించేది లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.     


తాజావార్తలు


logo