దేశ సగటు తెలంగాణలో
దవాఖానలు 51 109
పడకలు 1,405 2,662
ఐసీయూ బెడ్స్ 70 133
వెంటిలేటర్స్ 35 67
తెలంగాణకు క్యూ కడుతున్న ఇతర రాష్ర్టాల కరోనా రోగులు.. గత కొన్ని రోజులుగా మీడియా చానళ్లలో, పేపర్లలో దంచికొడుతున్న వార్త ఇది. దేశవ్యాప్తంగా ఎన్నో దవాఖానలు ఉండగా ఇక్కడికే ఎందుకు వస్తున్నారు? సగటు భారతీయుడి మదిలో సందేహం ఇది. దవాఖానలు ఉంటే సరిపోద్దా.. మౌలిక సదుపాయాలు ఉండాలి కదా. వైద్యం అందిస్తే సరిపోద్దా.. పర్యవేక్షణ ఉండాలి కదా. మందులు వేసుకొమ్మని చెప్తే సరిపోద్దా.. వీలైతే ఇంటికే తెచ్చి ఇవ్వాలి కదా. ఇవన్నీ చేసింది కాబట్టే కరోనా కట్టడిలో ఇప్పుడు తెలంగాణ నంబర్ వన్ అయ్యింది. ఈ మాట అంటున్నది చిన్నచితకా వ్యక్తులో, సంస్థలో కాదు.. జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సర్వే చెప్తున్న నిజాలివి.
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో కరోనా కట్టడైంది. వైరస్‌ను కట్టడి చేయటంలో తొలిస్థానంలో ఉన్న మన రాష్ట్రం.. మెడికల్ సౌకర్యాల్లో మూడో స్థానంలో నిలిచి సత్తా చాటింది. మార్చి 25, 2020 నుంచి నవంబరు 1 వరకు పరిస్థితులను ఆధారంగా చేసుకొని నిర్వహించిన ఈ సర్వేలో.. -0.64 ఇండెక్స్ స్కోర్‌తో కరోనాను కట్టడి చేసిన రాష్ట్రంగా దేశంలోనే తొలిస్థానంలో నిలవటం గమనార్హం. తెలంగాణ తర్వాత -0.53 ఇండెక్స్ స్కోర్‌తో రాజస్థాన్ రెండో స్థానంలో, -0.42 ఇండెక్స్ స్కోర్‌తో మూడో స్థానంలో బీహార్, -0.39 ఇండెక్స్ స్కోర్‌తో హర్యానా నాలుగో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, గుజరాత్, జమ్మూకశ్మీర్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు వరుస స్థానాల్లో నిలిచి యావరేజ్ ర్యాంకును దక్కించుకున్నాయి. ఢిల్లీ, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైనట్లు సర్వే పేర్కొన్నది. మొదటివేవ్లో తీసుకున్న ఈ జాగ్రత్తలతోపాటు.. రెండోవేవ్ ప్రారంభానికి ముందే వివిధ రంగాల్లో వైద్య రంగ మౌలిక సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం మరింతగా విస్తరించింది. దీనితో రెండోవేవ్ను కూడా సమర్థంగా ఎదుర్కొంటున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
కరోనా కట్టడిలో తొలి స్థానంలో నిలిచిన తెలంగాణ మెడికల్ సౌకర్యాల్లోనూ ఉత్తమ స్థానంలోనే నిలిచింది. 0.78 ఇండెక్స్ స్కోర్‌తో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. 2.18 ఇండెక్స్ స్కోర్‌తో కర్ణాటక తొలిస్థానంలో నిలువగా 1.44 ఇండెక్స్ స్కోర్‌తో కేరళ రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు, పంజాబ్ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. పశ్చిమబెంగాల్, గుజరాత్, జమ్ముకశ్మీర్, అస్సాం, ఒరిస్సాల్లో వైద్య మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని సర్వేలో తేలింది. ఇక మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లో అత్యంత దారుణంగా ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నది.
గతేడాది నవంబర్ 1 నాటికి దేశంలో తెలంగాణలో
మొత్తం టెస్టులు 11,07,43,103 43,23,666
పాజిటివ్ కేసులు 82,28,604 2,39,538
పాజిటివిటీ రేట్ 7.4 5.5
రాష్ర్టాల్లో ప్రతి 10లక్షల మందికి మెడికల్ సౌకర్యాలు
రాష్ట్రం దవాఖానలు బెడ్స్ ఐసీయూ వెంటిలేటర్స్
ఇండియా 51 1405 70 35
తెలంగాణ 109 2662 133 67
ఏపీ 18 1582 79 40
గుజరాత్ 20 938 47 23
తమిళనాడు 32 2040 102 51
ఉత్తరప్రదేశ్ 75 1229 61 31
పంజాబ్ 77 2021 101 51
మధ్యప్రదేశ్ 12 775 39 19
ఢిలీ 9 1942 97 49
కేరళ 94 2806 140 70
కర్ణాటక 161 3942 197 99
వైరస్ కట్టడిలో రాష్ర్టాలిలా..
రాష్ట్రం ఇండెక్స్ ర్యాంక్ మెడికల్ స్కోర్ సౌకర్యాల్లో ర్యాంకు
తెలంగాణ -0.64 1 3
రాజస్థాన్ -0.53 2 11
బీహార్ -0.42 3 20
హర్యానా -0.39 4 9
ఉత్తరప్రదేశ్ -0.38 5 10
గుజరాత్ -0.36 6 13
జమ్మూకశ్మీర్ -0.32 7 14
పంజాబ్ -0.30 8 5
మధ్యప్రదేశ్ -0.23 9 17
తమిళనాడు -0.12 10 4
కర్ణాటక 0.08 11 1
జార్ఖండ్ 0.14 12 18
ఏపీ 0.15 13 7
ఒడిశా 0.16 14 16
కేరళ 0.19 15 2
ఢిల్లీ 0.19 16 6
అస్సాం 0.24 17 15
పశ్చిమబెంగాల్ 0.71 18 12
ఛత్తీస్‌గఢ్ 0.85 19 19
మహారాష్ట్ర 0.98 20 8