టీఆర్ఎస్తోనే డబుల్ గ్రోత్ సాధ్యం: కేటీఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, డబుల్ ఇంజిన్ గ్రోత్ కావాలంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్నే గెలిపించాలని మంత్రి కేటీఆర్ నగరవాసులను కోరారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోషామహల్ నియోజకవర్గం జుమ్మెరాత్ బజార్లో మంత్రి కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా గోషామహల్ కార్పొరేటర్ అభ్యర్థి ముఖేష్ సింగ్, మంగల్హాట్ నుంచి పరమేశ్వరి సింగ్, బేగంబజార్ నుంచి పూజా వ్యాస్ బిలాల్, గన్‌ఫౌండ్రీ నుంచి మమతా సంతోష్ గుప్తా లను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు.
రాష్ట్రంలో జనరేటర్లు, ఇన్వర్టర్లు మాయమై ఇన్వెస్టర్లు వస్తున్నారన్నారు. రాష్ర్టానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరెంటు బాగుంది.. మంచినీళ్ల సౌలత్ ఉంది, టాలెంట్ ఉన్న పిల్లలు ఉన్నరు, అన్నింటికి మించి కేసీఆర్ వంటి దమ్మున్న నాయకులు ఉన్నరని ఇన్వెస్టర్లు వస్తున్నారన్నారు. నేడు చైన్ స్నాచింగ్ లేవు, దొమ్మీలు లేవు, ఆంధ్రా-తెలంగాణ పంచాయతీలు లేవు.. ఆరేళ్లుగా శాంతి ఉంది. ఇది అందరి హైదరాబాద్. కానీ కొంతమంది నేడు ఇది అందరి హైదరాబాద్ కాదు అంటున్నరు. అటువంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్, రూ. 5 కే అన్నపూర్ణ భోజనం, బస్తీదవాఖానాలు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
24 గంటల విద్యుత్‌తో పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఉన్నారు. కార్మికులకు పనిదొరుకుతుందన్నారు. ఢిల్లీ నుంచి, పక్క రాష్ర్టాల నుంచి ప్రచారానికి వచ్చేవాళ్లు ఇవాళ ఉంటరు రేపు పోతరు. కానీ మనమంతా ఇక్కడే ఉండాలన్నారు. కరోనాలో ఉన్నది తామే, వరదల కష్టంలో వచ్చింది తామేనన్నారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు. అన్ని రాష్ర్టాల ప్రజలు ఇక్కడ కలిసిమెలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు. అందరినీ సమానంగా చూస్తూ అభివృద్ధిలో నడిపిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటూ గ్రేటర్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
తాజావార్తలు
- సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: సీతమ్మకు స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- కూతుళ్లను డంబెల్‌తో కొట్టి చంపిన తల్లి
- మీకు డస్ట్ అలర్జీ ఉందా.. అయితే ఇవి తాగండి
- ‘మాస్టర్’ సినిమాపై నిహారిక రివ్యూ
- వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : తెలంగాణ రైతు సంఘం
- సమ్మర్ 2021 హౌజ్ ఫుల్..వేసవిలో 15 సినిమాలు
- పురుషుల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గించండిలా..
- పోరాడిన కెప్టెన్ జో రూట్
- పీహెచ్‌సీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్‌రావు