శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 02:50:29

డ్రైవర్లను ఓనర్లను చేస్తున్నాం

డ్రైవర్లను ఓనర్లను చేస్తున్నాం

  • కార్ల పంపిణీలో మంత్రి సత్యవతి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: డ్రైవర్లను ఓనర్లుగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. ఈ పథకం కింద 31 మంది గిరిజన యువకులకు సోమవారం సంక్షేమ భవన్‌లో కార్లను పంపిణీ చేశారు. ట్రైబల్‌ డిజిటల్‌ లీడర్‌షిప్‌ కార్యక్రమాన్ని కూడా ఆమె ప్రారంభించారు. ట్రైకార్‌ సంస్థ, మారుతి సుజుకి, ఎస్బీఐ, ఉబర్‌ సంస్థలు సంయుక్తంగా శిక్షణ ఇచ్చి కార్లను పంపిణీ చేస్తున్నట్టు ఆమె తెలిపారు.  కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ క్రిస్టినా ఝడ్‌చోంగ్తూ, కార్యదర్శి శ్రీధర్‌, ఎస్సీ కమిషనర్‌ యోగితారాణా పాల్గొన్నారు. logo