శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 02:39:39

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం

  • ముఖ్యమంత్రి చిత్రపటానికి వీఆర్‌ఏల క్షీరాభిషేకం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పేస్కేల్‌ కల్పిస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ తో తమ జీవితాల్లో వెలుగులు నిండాయని వీఆర్‌ఏలు సంతోషం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏలో వీఆర్‌ఏ సంఘాల ప్రతి నిధులు సమావేశమయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభి షేకంచేశారు. సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉం టామని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి గౌతమ్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, వీఆర్‌ఏ సంఘాల అధ్యక్షులు రాజయ్య, వెంకటేశ్‌ యాదవ్‌, రమేశ్‌ బహదూర్‌ తదితరులు పాల్గొన్నారు. 

భూ పంచాయితీలు తగ్గుతాయి

కొత్త చట్టంతో భూ పంచాయితీలు తగ్గే అవకాశమున్నది. భూ వివాదాల్లో.. ఒకరి పేరుమీద ఉన్న భూమి మరొకరికి బదలాయించడం, వారసులమధ్య తగాదాలే ఎక్కువ. ధరణి రూపంలో వాటికి పరిష్కారం లభించినట్టయ్యింది. రికార్డులు పక్కాగా ఉంటాయి కాబట్టి వివాదాలకు తావే లేదు.   

- రవీందర్‌రెడ్డి, ట్రెసా అధ్యక్షుడు 

ఏ శాఖకైనా వెళ్లేందుకు సిద్ధం

సీఎం కేసీఆర్‌ లోతుగా విశ్లేషించిన తర్వాతే నిర్ణ యం తీసుకుంటారని, అది ప్రజలకు, ఉద్యోగులకు మేలు చేసేదిగా ఉంటుందని మాకు తెలుసు. అం దుకే వీఆర్వో పదవుల రద్దును స్వాగతిస్తున్నాం. ఏ శాఖకైనా సంతోషంగా వెళ్తాం. సమర్థంగా పనిచేస్తాం. ఏ శాఖకు వెళ్లాలో ఆప్షన్‌ ఇస్తే బాగుంటుంది.

- విజయ్‌రావు, వీఆర్వోల సంఘం 

కలలోనూ ఊహించని వరం 

పేస్కేల్‌ ఉద్యోగాలు ఇస్తే రాష్ట్రంలోని వీఆర్‌ఏలందరి జీవితాలు బాగుపడుతాయి. తరతరాలుగా మస్కూరీలుగా ఉంటున్నవారికి ఇది కలలో కూడా ఊహించని వరం. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా వచ్చినవారికి చదువు, అర్హతలకు తగినట్టుగా ఉద్యోగ జీవితంలో ఎదిగే అవకాశం వచ్చింది.  

- వెంకటేశం, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ వీఆర్‌ఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

పారిశ్రామికంగానూ మేలు

నూతన రెవెన్యూ చట్టం పారిశ్రామికంగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పారిశ్రామిక ప్రాజెక్టులకు భూమి కొనే సమయంలో జాప్యాలకు కారణమవుతున్న వివాదాలకు పరిష్కారం దొరుకుతుంది. సీఎం కేసీఆర్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 

- కే సుధీర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు 

పేదలకు మేలు చేస్తుంది..

కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పేద రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. భూముల క్రయ విక్రయాల్లో పారదర్శకత ఉంటుంది. దేశానికే ఆదర్శమవుతుంది. ప్రజానాయకుడిగా సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని యావత్‌ ఎన్నారై సమాజం హర్షిస్తున్నది. 

- టీఆర్‌ఎస్‌ ఎన్నారై నాయకుడు అనిల్‌ కూర్మాచలం

రెవెన్యూ సంస్కరణలు సూపర్‌

అధునాతన టెక్నాలజీతో భూరికార్డుల అనుసంధానం అభినందనీయం. టెక్నాలజీ ఆధారిత సేవలు ప్రజల, రైతుల భూ కష్టాలు తీర్చుతాయి. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా టెక్నాలజీ సేవలు అందించేందుకు టిటా  సదా సిద్ధం.

-సందీప్‌ కుమార్‌ మక్తాల, టిటా గ్లోబల్‌ ప్రెసిడెంట్‌


logo