గురువారం 09 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 16:10:01

ఫైనాన్స్ దందాలపై ఉక్కుపాదం మోపుతాం

ఫైనాన్స్ దందాలపై ఉక్కుపాదం మోపుతాం

మహబూబ్ నగర్ : గతంలో సహకార సంఘాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. రుణాలు ఇచ్చిన వాళ్లు లేరూ..తీసుకున్న వాళ్ళు లేరు..కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన వాళ్లపై విచారణ కొనసాగుతున్నదని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్-మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో జిల్లాలో స్వయం ఉపాధి కల్పనకై చిరు వ్యాపారులకు మంత్రి చేతుల మీదుగా 45 మంది లబ్ధిదారులకు రూ. 50 లక్షల లోన్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డైలీ ఫైనాన్స్ పేరు మీద పది రూపాయల వడ్డీ వసూలు చేస్తోన్న జలగల వివరాల్ని పోలీసు శాఖ వివరాలు సేకరిస్తుందన్నారు.

చిరు వ్యాపారులను వడ్డీ వ్యాపారస్తుల్ని ఆ విష వలయం నుంచి విముక్తి చేసేందుకే  పీఏసీఎస్ ల ద్వారా అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నామని తెలిపారు. చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు సంఘాల కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లను తెరవాలని అధికారులకు సూచించారు. రుణాలు తీసుకున్న వాళ్లు సకాలంలో చెల్లింపులు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఆంజనేయులు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

logo