సోమవారం 25 మే 2020
Telangana - Mar 31, 2020 , 08:27:42

మంత్రి కేటీఆర్ కు ఏపీ వాసి కృతజ్ఞతలు

మంత్రి కేటీఆర్ కు ఏపీ వాసి కృతజ్ఞతలు

హైదరాబాద్ : కరోనా వైరస్ ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలను ఇతర రాష్ర్టాల ప్రజలు ప్రశంసిస్తున్నారు. హైదరాబాద్‌లో తాము సురక్షితంగా ఉన్నామని తెలుపుతూ.. శివయ్య ముండ్లపాటి అనే వ్యక్తి మంత్రి కేటీఆర్  కు ట్వీట్ చేశాడు.

‘నేను ఆంధ్రప్రదేశ్‌వాసిని. హైదరాబాద్‌లో పనిచేస్తున్న. కరోనా కట్టడిలో భాగంగా మొదట్లో నన్ను ఏపీకి వెళ్లకుండా అడ్డుకోవడం ఇబ్బందిగా అనిపించింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, శ్రద్ధ నన్ను ఎంతగానో అనందపరిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను హైదరాబాద్‌లో చాలా సురక్షితంగా ఉన్నాను. కరోనా వ్యాప్తిని నిరోధించడంతోపాటు అన్ని ప్రాంతాల ప్రజల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు’ అని శివయ్య ముండ్లపాటి ట్వీట్‌చేశారు. 

logo