మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:32:01

మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

  • అందుకే క్రైస్తవులకు 40 ఎకరాల్లో స్మృతివనం
  • మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మైనార్టీల అభివృద్ధిలో భాగంగానే సీఎం కేసీఆర్‌ క్రైస్తవుల కోసం హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో 40.1 ఎకరాలను స్మృతివనాల కోసం కేటాయించారని చెప్పారు. స్మృతి వనం అభివృద్ధి, నిర్వహణపై శుక్రవారం బీఆర్కేభవన్‌లో అధికారులతో సమీక్షించారు. స్మృతివనం నిర్వహణకు రెండు స్థాయిల్లో కమిటీలు ఉండాలని చెప్పారు. క్రైస్తవ స్మృతివనాలకు సంబంధించి రాష్ట్రస్థాయి కమిటీలో సభ్యులుగా మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి, డైరెక్టర్‌, క్రైస్తవులకు  సంబంధించిన ఇద్దరు, నలుగురు ఆలిండియా సర్వీస్‌ అధికారులను ప్రభుత్వం నియమిస్తుందని మంత్రి వెల్లడించారు. సమావేశంలో మైనార్టీ సంక్షేమశాఖ సలహాదారు ఏకేఖాన్‌, ఆ శాఖ కార్యదర్శి అహ్మద్‌ నదీం, డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసిం, సీఎఫ్‌సీ ఎండీ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు. logo