e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home Top Slides స్వయంసాధికారతే లక్ష్యం

స్వయంసాధికారతే లక్ష్యం

 • ఉన్న ఊరులోనే ఉన్నతంగా ఎదిగేందుకు మార్గాలెన్నో..

హైదరాబాద్‌, జూలై 26 (నమస్తే తెలంగాణ): స్వయంసాధికారతే లక్ష్యంగా దళితబంధు పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. దళితుల్లో అత్యంత నిరుపేదల్ని గుర్తించి వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించటం ద్వారా ఆ కుటుంబం శాశ్వత పేదరికం నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఈ పథకానికి రూపల్పన చేశారు. హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా మొదలవుతున్న ఈ ప్రతిష్ఠాత్మక పథకం ద్వారా లబ్దిపొందిన దళిత కుటుంబాలు ఏయే రంగాలను ఎంచుకొని పురోగమించవచ్చో అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి, ఒక కుటుంబానికి మరో కుటుంబానికి ఏకరీతి విధానం ఉండకపోవచ్చు. లబ్ధిపొందే అర్హుల అభిరుచి, అర్హత, అనుభవం వీటితోపాటు అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ ఈ మూడు క్యాటగిరీలుగా ప్రాంతాలను విభజించి వారుండే ప్రాంతాల్లో ఉండే వనరులు, మార్కెట్‌ అవసరాలు తదితర అంశాల ప్రాతిపదికగా.. సదరు కుటుంబాలు తమ కాళ్ల మీద తాము నిలదొక్కుకోవటానికి చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తున్నది. దళితబంధు కింద ఎలాంటి అంశాలను పరిశీలించవచ్చు.. ఏ తరహా స్కీములను అమలు చేయవచ్చో.. ఆలోచన చేస్తున్నది.

గ్రామీణ ప్రాంతాలు

 • మినీ డెయిరీ యూనిట్‌. ఇందులో 10 నుంచి 12 పాడి బర్రెలతో ఒక యూనిట్‌
 • వరి నాటువేసే యంత్రాల యూనిట్‌ (రెండు వరినాటు యంత్రాలు, ఒక పవర్‌ టిల్లర్‌)
 • వేపనూనె, పిండి తయారీ పథకం కింద రెండు యూనిట్లతోపాటు ఒక ఆటో ట్రాలీ.

రూరల్‌, సెమీ అర్బన్‌ ప్రాంతాలు

 • వ్యవసాయసాగు కోసం యంత్ర పరికరాల సేల్స్‌ యూనిట్‌
 • మట్టి ఇటుకల తయారీతోపాటు ఒక ట్రాలీ
 • ఒక ట్రాక్టర్‌ అండ్‌ ట్రాలీ
 • కోడిపిల్లల పెంపకం (నాటు కోళ్లు, బ్రాయిలర్‌కోళ్లు) చేపట్టి సుగుణ, వెన్‌కాబ్‌ వంటి సంస్థలతో ప్రాంచైజీ
 • 7 సీటర్‌ ఆటో ఆటో రిక్షా సరుకు రవాణా కోసం ఆటో ట్రాలీ
 • ప్రభుత్వ అనుమతితో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల దుకాణం
 • టెంట్‌ హౌజ్‌, డెకరేషన్‌, సౌండ్‌ సిస్టమ్‌ వీటి తరలింపు కోసం ఆటో ట్రాలీ
 • వ్యాపార అనుకూలత కలిగిన ప్రాంతాల్లో సొంత ఇంటి ముందు స్థలం ఉంటే మడిగల నిర్మాణం చేపట్టి వ్యాపార నిర్వహణకు దోహదపడేవిధంగా యూనిట్‌
 • ఆయిల్‌ మిల్‌, పిండిగిర్ని, బియ్యం పిండి, పసుపు, కారం యూనిట్ల ఏర్పాటు
 • ప్రయాణికుల, సరుకుల రవాణాకు ఉపయోగపడే విధంగా ఫోర్‌ వీలర్‌ యూనిట్‌
 • ఎలక్ట్రానిక్‌ పరికరాల అమ్మకాలు, సేవలు
 • విజయ, అపోలో వంటి సంస్థలతో డయాగ్నస్టిక్‌ ల్యాబ్స్‌, మెడికల్‌ షాపు
 • ఎలక్ట్రికల్‌ షాప్స్‌, బ్యాటరీ సేల్స్‌ అండ్‌ సర్వీసెస్‌ షాపు
 • హార్డ్‌వేర్‌ అండ్‌ సానిటరీ దుకాణం విత్‌ ఆటో ట్రాలీ
 • సిమెంట్‌ ఇటుకలు, రింగుల తయారీ, ఫ్రీ కాస్టింగ్‌ స్ట్రక్చర్స్‌ ప్లస్‌ ఆటో ట్రాలీ
 • సెంట్రింగ్‌, ఆర్‌సీసీ రూప్‌ మేకింగ్‌ యూనిట్‌ (స్టీల్‌ అండ్‌ వుడ్‌), రెడీ మిక్సీ తయారీ యూనిట్‌
 • ఆక్రాలిక్‌ షీట్స్‌ అండ్‌ టైల్స్‌ వ్యాపారం ప్లస్‌ ఆటో
 • రెడీమిక్స్‌ తయారీ యంత్రాలు
 • హోటల్‌ అండ్‌ క్యాటరింగ్‌ సర్వీసెస్‌ విత్‌ ఆటో ట్రాలీ
 • హైవేలపై దాబా యూనిట్‌.
 • ఐరన్‌ గేట్స్‌, గ్రిల్స్‌ తయారీ యూనిట్‌ విత్‌ ఆటో ట్రాలీ
 • ప్రభుత్వ అనుమతితో మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ ఏర్పాటు
 • బిగ్‌ బజార్‌, విజేత వంటి పెద్దపెద్ద మాల్స్‌తో ప్రాంచైజీ చేయించి మినీ సూపర్‌ బజార్ల నిర్వహణ
 • డీటీపీ, మీ సేవ, సీఎస్సీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ సెంటర్‌ విత్‌ ఫొటో స్టూడియో
 • బిల్డింగ్‌ మెటీరియల్‌ స్టోర్స్‌, హార్డ్‌వేర్‌ దుకాణాలు
 • మార్బుల్‌ పాలిషింగ్‌, గ్రానైట్‌ కటింగ్‌, పీవోపీ యూనిట్‌
 • ఫుడ్‌ అండ్‌ బేవరేజెఎస్‌ రెస్టారెంట్‌, సిమెంట్‌ లేదా స్టీల్‌ సబ్‌ డీలర్‌షిప్‌
 • పశువులు/కోళ్ల దాణా తయారీ కేంద్రాలు ఆటో ట్రాలీతో సహా
 • పాద రక్షలు/ లెదర్‌ గూడ్స్‌ దుకాణం యూనిట్‌
 • ఫొటోఅండ్‌ వీడియోగ్రఫీ విత్‌ డ్రోన్‌.
 • 2 ఆటో ట్రాలీలతోకూడిన యూనిట్‌తో రెసిడెన్షియల్‌ పాఠశాలలు, హాస్టళ్లకు ఆహార పదార్థాలు, కూరగాయల సరఫరా మొదలైనవి.

పట్టణ ప్రాంతాలు

 • మొబైల్‌ (4 వీలర్‌) టిఫిన్‌ సెంటర్‌
 • క్లాత్‌ ఎంపోరియం, టెక్స్‌టైల్‌, రెడీమేడ్‌ గార్మెంట్స్‌ షోరూం
 • ఆటో ట్రాలీతో కూడిన పేపర్‌ ప్లేట్స్‌ / గ్లాసెస్‌, బ్యాగ్‌ మేకింగ్‌, న్యాప్‌కిన్‌ మేకింగ్‌ యూనిట్‌ (వేర్వేరుగా డిస్పోజబుల్‌, నాన్‌ డిస్పోజబుల్‌)
 • క్యాబ్‌ (కార్‌ టాక్సీ)
 • ఎంబ్రాయిడరీ, టైలరింగ్‌, లేడీస్‌ ఎంపోరియం
 • కిచెన్‌వేర్‌, ఫర్నిచర్‌ షాప్‌ (సేల్స్‌ అండ్‌ సర్వీసెస్‌).
 • ప్లెక్సీ, వినైల్‌ అండ్‌ డిజిటల్‌ ప్రింటింగ్‌ విత్‌ ఆటో ట్రాలీ
 • డిజిటల్‌ ఫొటో స్టూడియో విత్‌ ల్యాబ్‌
 • ఆటోమొబైల్‌ విడిభాగాల దుకాణం, సర్వీసింగ్‌ సెంటర్‌ యూనిట్‌
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana