టాలీవుడ్ యాక్టర్ రానా నటిస్తోన్న చిత్రం అరణ్య. ప్రభు సోలోమన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ‘హృదయమే జ్వలించనే’ పాటను మేకర్స్ విడుదల చేశారు. హృదయమే జ్వలించనే..ప్రాణమే విడిచి పోయేనే..నీలి మబ్బునడుగు నిజం తెలుపుతుంది. పూల తీగనడుగు తావి తెలుపుతుంది..చిన్ని మొక్కనడుగు చిగురు తెలుపుతుంది అంటూ ప్రకృతి ఒడిలో తిరుగుతూ రానా బావోద్వేగపూరిత సన్నివేశాలతో సాగుతున్న సాంగ్ అందరినీ కంటతడిపెట్టించేలా ఉంది.
ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో విష్ణువిశాల్, జోయాహుస్సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్పొరేట్ సంస్థల కుట్రలపై పోరాడే వ్యక్తి పాత్రలో రానా కనిపించబోతున్నాడు. పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలనను చర్చిస్తూ సందేశాత్మకంగా సాగనుంది. మార్చి 26న విడుదల కానుంది. అరణ్యకు శంతను మొయిత్రా మ్యూజిక్ డైరెక్టర్.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.