హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు నితిన్. భీష్మ సినిమాతో ఓ మోస్తారు హిట్ కొట్టిన నితిన్ ఈ ఏడాది చెక్, రంగ్ దే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు చిత్రాలు ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో బాలీవుడ్ మూవీ అంధాదున్ రీమేక్‌పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఈ రోజు నితిన్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మ్యాస్ట్రో అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తుంది.
బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా చేసిన పాత్రను తెలుగులో నితిన్ చేస్తుండగా.. రాధికా ఆప్టే చేసిన హీరోయిన్ పాత్రలో నభా నటేశ్ నటిస్తోంది. ఇక సినిమాలో మెయిన్ రోల్ టబు. ఈ పాత్రను తెలుగులో తమన్నా భాటియా చేస్తుండటం విశేషం. జూన్ 11న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరోవైపు నితిన్ 30వ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ మరి కొద్ది సేపట్లో రివీల్ చేయనున్నారు. నేడు 38వ వసంతంలోకి అడుగుపెట్టిన నితిన్ తన బర్త్‌డేని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా జరుపుకున్నారు. ప్రస్తుతం నితిన్ బర్త్ డే కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా, ఇందులో సింగర్ సునీత, ఆమె భర్త రామ్, నితిన్ సతీమణి కనిపిస్తున్నారు.