మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 19:28:01

సరళ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

సరళ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

వనపర్తి  :  జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం మదనపూర్ మండలం సరళ సాగర్ ప్రాజెక్టు నుంచి రైతుల పంట పొలాలకు సాగు నీటిని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. గత డిసెంబర్ 31 నాడు తెగిపోయిన సరళ సాగర్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్  సహకారంతో అతి తక్కువ కాలంలో నే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి.. ఈ వర్షాకాలానికి సాగునీటి విడుదల చేశారు. వర్షాకాలం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేకు, ప్రాజెక్టుకు అతి త్వరలోనే పూర్వ వైభవం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయకట్టు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.logo