గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 21:28:31

రేపు శ్రీరాంసాగర్‌ నుంచి నీటి విడుదల : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

రేపు శ్రీరాంసాగర్‌ నుంచి నీటి విడుదల :  మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌: నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు చెందిన సరస్వతీ కాలువ నుంచి శుక్రవారం నీటిని విడుదల చేయనున్నారు. వారబందీ పద్దతి ద్వారా వానకాలం పంటలకు నీటి విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి  వివరించారు.

ముందస్తు సాగుతో కాలువ నీటి ప్రయోజనం ఉంటుందని, రైతులు నీటి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 35,753 ఎకరాలకు చివరి ఆయకట్టు వరకు సాగులో ఉన్న పంటలకు అక్టోబర్‌ వరకు నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo