ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 11:38:37

కొండపోచమ్మ జలాశయం నుంచి నీటి విడుదల

కొండపోచమ్మ జలాశయం నుంచి నీటి విడుదల

సిద్దిపేట : గోదావరి జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులు పొలాల్లో పారేందుకు సిద్ధమయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాజగా కొండపోచమ్మ జలాశయం నుంచి నీటిని ఎఫ్‌ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగడి సునిత గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. దీంతో గజ్వేల్, ఆలేరు మండలాలకు కాళేశ్వరం తొలి ఫలాలు అందనున్నాయి. కాగా, మొదట చింతకుంట, బంజరకుంట చెరువుల్లోకి గోదావరి జలాలు చేరనున్నాయి.


కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా 521 చెరువులు కుంటలను నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా తొలి విడతగా బుధవారం 37 చెరువులు కుంటలను నింపేందుకు నీళ్లను వదిలారు. జగదేవ్ పూర్ మండలంలో 28 చెరువులు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని 9 గోదావరి జలాలతో నింపుతారు. ఈ చెరువుల కింద సుమారు 60 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. కొండపోచమ్మ జలాశయానికి గతనెల 29న సీఎం కేసీఆర్ చేతులమీదుగా నీళ్లను వదిలిన విషయం తెలిసిందే. ఎన్నో ఏండ్ల కలలు సాకారం అవుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


logo